కృష్ణా: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి సాధిస్తోందని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. శనివారం పెనమలూరులోని గ్రీన్ స్కూలులో విద్యా మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే విచ్చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన శాస్త్ర సాంకేతిక అంశాలు తిలకించి నిర్వాహకులను అభినందించారు.