GDWL: పెండింగ్లో ఉన్న భూ భారతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ భవనంలో మండలాల వారీగా మీసేవ దరఖాస్తులు, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్, ఎఫ్-లైన్ పిటిషన్లపై సమీక్షించారు. ఆరు నెలలు దాటిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని ఆయన సూచించారు.