ATP: రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వారిని పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌లో పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. అనంతరం వారితో కలిసి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వేడుకల్లో పాల్గొన్నారు.