NLG: నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లి పరిధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రం అందించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ చట్ట బద్దంగా ఇవ్వాలన్నారు.