మీరు ‘బ్లూమ్ స్క్రోలింగ్’ గురించి విన్నారా? ఇది డూమ్ స్క్రోలింగ్(చెడు వార్తలు చూడటం)కు పూర్తి విరుద్ధం. అభివృద్ధికి ఉపయోగపడే, మానసిక ప్రశాంతతను, సంతృప్తిని కలిగించే మంచి విషయాలను మాత్రమే చూడటాన్ని బ్లూమ్ స్క్రోలింగ్ అంటారు. ఇలాంటి కంటెంట్‌ను చూడటం వల్ల మెదడులో డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.