AP: కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని మాజీ సీఎం జగన్ తెలిపారు. ‘చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేశారు. 18న గవర్నర్కు సంతకాలను అందజేస్తాం. ఉద్యమానికి అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ప్రజా ఆస్తులను ప్రైవేటుకు అప్పగించాలన్న.. కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది’ అని పేర్కొన్నారు.