NTR: వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద రూ.15 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధుల మంజూరుతో పథకం పరిధిలోని సుమారు 17 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం తిరిగి అందుబాటులోకి రానుందని ఆమె తెలిపారు.