KRNL: వెల్దుర్తి పరిధిలోని బ్రహ్మగుండం పుణ్యక్షేత్రంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. తేనె కోసం అటవీ ప్రాంతానికి వచ్చిన వృద్ధుడు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇవాళ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.