NZB: జిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు జిల్లా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 18 మంది మద్యం సేవించి పట్టుబడ్డారు. వారిని మంగళవారం మార్నింగ్ కోర్టులో హాజరు పరచగా, అందులో 16 మందికి రూ.1,65,000లు, మిగిలిన ఇద్దరికి 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.