MLG: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంగపేట మండలం దోమెడ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఈ నెల 9న ప్రమాదానికి గురయ్యారు. ఏటూరునాగారంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క వెంట వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో వాడగూడెం వద్ద ఇసుక లారీని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, సీతక్క ఆదుకోవాలని కుటుంబీకులు కోరారు.