SRCL: సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ శివాజీ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపెల్లి జిల్లా కొమ్మిరి గ్రామానికి చెందిన శివాజీ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుంటుంబికులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.