NZB: నవంబర్ 1న నిజామాబాద్ నగరంలో ప్రారంభమైన 10 మంది అయ్యప్ప దీక్షపరుల మహా పాదయాత్ర శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం చేరడంతో నిన్న ముగిసింది. ఎన్జడ్బి బృందం బాన్సువాడలో గురు వినయ్ కుమార్ నేతృత్వంలోని 350 మంది స్వాములతో కలిసి పులిమేడు మార్గాన సన్నిధానాన్ని చేరుకున్నారు. దీక్షాపరులు నేడు చెంగనూర్ నుంచి రైలు, రోడ్డు మార్గాలలో తిరుగు ప్రయాణమయ్యారు.