NZB: నందిపేట్ మండలం కంఠం సర్పంచ్‌గా సాయినాథ్ గెలుపొందారు. బుధవారం మండలంలో జీపీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థి సాయినాథ్ 712 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇంద్రుడుకు 711 ఓట్లు వచ్చాయి. దీంతో సాయినాథ్ కేవలం ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.