AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సంతకాల ప్రతులతో కూడిన రథాలను మాజీ సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సేకరించిన ప్రతులను తాడేపల్లికి తరలిస్తున్నారు. వీటిని జగన్ సాయంత్రం గవర్నర్కు సమర్పించనున్నారు.