గర్భిణులు, గర్భం దాల్చాలనుకునే స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఇది శిశువు మెదడు, వెన్నుపాము అభివృద్ధికి సహాయపడటంతో పాటు గర్భస్రావం, నెలలు నిండక పుట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుందట. అలాగే తల్లి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఆరోగ్యవంతమైన శిశువు జననం కోసం రోజూ ఫోలిక్ యాసిడ్ ఉండే ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.