SRCL: గ్రామపంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల కోసం చేసిన ఖర్చుల వివరాలు సమర్పించాలని అధికారులు కోరారు. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులందరికీ ఎంపీడీవో కార్యాలయాల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజులలోగా ఎన్నికల ఖర్చుల సమగ్ర వివరాలను ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాలన్నారు.