AP: మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి బాపట్ల జిల్లా అద్దంకిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రూ.20 లక్షలతో నిర్మించిన సైడ్ కాలువలను, రూ.10 లక్షలతో మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన ప్రహరీగోడను ప్రారంభించారు.