VSP: ఉపాధి హామీ పథకానికి ఊపిరి తీయవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎంజిఎన్దేగా పేరును మార్చి నిర్వీర్యం చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో నిరసన జరిగింది. 200 రోజులు పని దినాలు గ్యారెంటీగా కల్పించాలని, నిధులు కేంద్రమే భరించాలని కోరారు.