AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. కేంద్ర సాయం రూ.590.91 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అయ్యారు.