HYD: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ కాలనీలో వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గండీడ్‌కు చెందిన దామం అంజయ్య (42) ఇంట్లో కాలుజారి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో అంజయ్యకు గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.