GDWL: అయిజ కొత్త బస్టాండ్ నుంచి కర్నూలు చౌరస్తా ప్రధాన రోడ్డుపై తెలంగాణ చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కంపాటి భగత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం గుంతలకు గ్రావెల్ వేసి చదును చేశారు. వాహనదారులు వారి సేవలను ప్రశంసించారు.