2010లో జరిగిన అనుపమ గులాటీ హత్య కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా రాజేష్ గులాటి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఎలక్ట్రిక్ రంపంతో 72 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. కింది కోర్టు 2017లో అతనికి జీవిత ఖైదు, రూ.15 లక్షల జరిమానా విధించింది. తాజాగా హైకోర్టు ఈ శిక్షను సమర్థిస్తూ అతని బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.