టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన ఈరోడ్ సభలో ఆయన మాట్లాడారు. ఉచిత పథకాలకు తాను వ్యతిరేకం కాదని, ఉచిత పథకాలను తానెప్పుడూ విమర్శించలేదని పేర్కొన్నారు. ఉచిత పథకాల పేరుతో ప్రజలను అవమాస్తున్నారని, ప్రజలకు కనీస వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండా ఎందుకు ఉచిత పథకాలుగా మారుస్తున్నారని ప్రశ్నించారు.