NDL: రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలు తీరును ఈయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.