అంపైర్ల అనాలోచిత నిర్ణయం కారణంగానే IND vs SA నాలుగో టీ20 రద్దయిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అంపైర్ల నిర్ణయం నాకు ఆశ్చర్యానికి కలిగించింది. రాత్రిపూట పొగమంచు మరింత తీవ్రమవుతుంటే.. సమయం గడిచేకొద్దీ పరిస్థితి మెరుగుపడుతుందని వారు ఎలా అనుకుంటున్నారు?’ అని మండిపడ్డాడు. కాగా, పొగమంచు కారణంగా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.