MBNR: జిల్లాలో 102 అంబులెన్స్ డ్రైవర్ల నియామకానికి ఈ నెల 19న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ ఉదయ్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం, బ్యాడ్జి నంబర్ ఉండి 35 ఏళ్ల లోపు వయస్సు గల వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు.