‘శంబాల’ షూటింగ్లో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆది గాయాలతోనే షూటింగ్ పూర్తి చేసి.. ఆసుపత్రికి వెళ్లినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రాబోతుంది.