TG: మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెస్సీ ఈవెంట్‌కు తాను గెస్ట్‌గా మాత్రమే వెళ్లినట్లు చెప్పారు. సింగరేణి యాజమాన్యం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందన్నారు. ఫుట్ బాల్ ఆడించాలనే తన మనవడిని తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. తాము పబ్బులు, గబ్బుల చుట్టూ తిప్పలేదన్నారు.