AP: రాష్ట్రంలో శాంతిభద్రతలపై అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. 15 శాతం వృద్ధిరేటు సాధించాలంటే శాంతిభద్రతలు ముఖ్యమని తెలిపారు. విశాఖలో దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దీని వెనుక కొందరు రాజకీయ నేతలు ఉన్నారని మండిపడ్డారు. ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే సహించొద్దని పవన్ సూచించారు.