సింధుతాయ్ సప్కాల్ మహారాష్ట్రలో జన్మించారు. ఆమెకు పదేళ్ళ వయసులో 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె గర్భవతిగా ఉన్నపుడు తన భర్త వదిలిపెట్టారు. ఆమె కుటుంబీకులు కూడా రానివ్వలేదు. దీంతో ఓ పశువుల పాకలో తన బిడ్డకు జన్మనిచ్చారు. రైళ్లలో భిక్షాటన చేస్తూ.. పాటలు పాడుతూ వేయి మంది అనాథలను దత్తత తీసుకుని అనాథ పిల్లల అమ్మగా ఎదిగారు. 2021లో ఆమెను కేంద్రం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.