AP: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పులివెందుల మండలంలోని వేంపల్లిలో 8వ తరగతి చదువుతున్న బాలిక ప్రసవించిన ఘటన కలకలం రేపింది. గర్భం దాల్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచగా, బాలికకు పురిటి నొప్పులు రావడంతో ఇంటి వద్దే ప్రసవానికి ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో బాలికను పులివెందులకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది.