భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దుకు పొగ మంచు కారణం కాదని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. గాలి కాలుష్యం వల్లే మ్యాచ్ రద్దయ్యిందని చెప్పారు. ‘ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు లక్నోకు చేరుకుంది. అందుకే లక్నోలో జరగాల్సిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ రద్దయ్యింది. ఈ మ్యాచ్ రద్దుకు మంచు కారణం కాదు. విషపూరితమైన గాలి కాలుష్యం’ అని అన్నారు.