కోనసీమ: వచ్చే ఆదివారం నుంచి మండపేటలోని మునిసిపల్ పాఠశాలల్లో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండపేట పురపాలక సంఘం కమిషనర్ టీవీ రంగారావు పేర్కొన్నారు. మండపేట మునిసిపల్ ఉపాధ్యాయుల సమావేశం గురువారం సాయంత్రం మునిసిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మండపేట పురపాలక సంఘ పరిధిలో గల పురపాలక సంఘ పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు.