భారత్, సౌతాఫ్రికా మధ్య లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అభిమానులు.. టికెట్ల సొమ్ము రీఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీసీసీఐ తాజాగా స్పందించింది. టికెట్ల సొమ్ము రీఫండ్ అంశం రాష్ట్రాల క్రికెట్ సంఘాల పరిధిలోకి వస్తుందని బీసీసీఐ కార్యదర్శి సైకియా పేర్కొన్నారు.