NRPT: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట జీపీ ఉపసర్పంచ్ ఎన్నిక గురువారం ఉత్కంఠగా సాగింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు ఒక్క ఓటు తేడాతో గెలవగా, BRS నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై రాము ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు.