కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రశంసించారు. స్మార్ట్ కిచెన్ అమలులో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు.