PDPL: జిల్లాలోని అన్ని రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేలిముద్ర ఆధారంగా 100% ఈ-కేవైసీ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 76.29% మంది మాత్రమే పూర్తి చేయగా,1,68,272 మంది లబ్ధిదారులు 5 సంవత్సరాలు నిండిన పిల్లలను కార్డులో చేర్చి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అన్నారు.