HYD: ఆస్ట్రేలియాలోని సిడ్నీ కాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందిన వాడే అయినప్పటికీ, ఈ ఉగ్రవాద చర్యతో నగరానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్రమ్ ఆరు సార్లు భారతదేశానికి వచ్చాడన్నారు. 1998లో భార్యతో పాటు హైదరాబాద్ మొదటిసారి వచ్చినట్లు తెలిపారు.