VZM: ఖరీఫ్ 2025–26లో జిల్లాలో 359 RSKల ద్వారా 37,800 రైతుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.373 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా మేనేజర్ బి.శాంతి శుక్రవారం తెలిపారు. అదనపు కిలోలు డిమాండ్ చేసిన పలు రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేసి, తూకంలో మోసాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.