NLG: శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ తాళ్లూరి వెంకన్న నిన్న హఠాత్తుగా మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సాయం అందించారు. వెంకన్న మరణం జర్నలిజం రంగానికి తీరని లోటూ అంటూ.. సదరు ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యారు.