ADB: జైనథ్ మండలంలోని పలు గ్రామాలలో మాజీమంత్రి జోగు రామన్న శుక్రవారం పర్యటించారు. మండలంలోని కౌట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చిట్యాల ఆశన్న తల్లి భూమాబాయి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.