KDP: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి జీ రామ్ జీ గా పేరు పెట్టడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. శుక్రవారం కడపలోని రెండో గాంధీ బొమ్మ వద్ద సీపీఎం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ పేదలు, వలస కార్మికులు, కూలీలకు కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం చేస్తుందన్నారు.