ATP: రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాజ్యాంగ విలువలని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.