ATP: బాలవెంకటాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే అమినేని సురేంద్రబాబు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మూడు చోట్ల విడివిడిగా ఉన్న పాఠశాలను ఒకే చోట ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెండు అదనపు గదులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.