KDP: పులివెందుల నియోజకవర్గానికి చెందిన భవదీప్ రెడ్డి, ఐఈఎస్ పరీక్షల్లో ఆలిండియా 77వ ర్యాంకు సాధించి ఎంపికయ్యారు. ఎర్రగుంట్ల ఆర్టీపీపీ డీఏవీ స్కూల్లో పనిచేస్తున్న ఆయన, గేట్ పరీక్షల్లోనూ 49వ ర్యాంకు సాధించి సీనియర్ ఫీల్డ్ అధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం పలువురు ఆయనను అభినందించారు.