SKLM: బూర్జ మండలం లచ్చయ్యపేటలో సరుబుజ్జిలి ఏడీ రోణంకి ఆనందరావు ఆధ్వర్యంలో ఆడ దూడ ఉత్పత్తి పథకం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూడలకు నట్టల నివారణ, సరైన పోషణ, ఏడాదికి ఒక దూడ పుట్టేలా తీసుకోవాల్సిన చర్యలు, పశు గ్రాసాల పెంపకం, గర్భస్థ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. నేటి లేగ దూడలే రేపటి పాడిపశువులుగా ఎదుగుతాయని ఆయన తెలిపారు.