రాజంపేటను జిల్లా కేంద్రంగా చూడాలనే ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల్లో మెండుగా ఉందని జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు అన్నారు. రాజంపేటలో శుక్రవారం జరిగిన ప్రజా గర్జనలో ఆయన మాట్లాడుతూ.. రాజంపేట ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా అడగడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. అందరం ఐక్యంగా ఉండి, ఈ పోరాటాన్ని ఇలాగే ముందుకు తీసుకుపోవాలని కోరారు.