NZB: బోధన్ మున్సిపల్ పరిధిలో వందశాతం పన్నులను వసూలు చేయాలని మున్సిపల్ సిబ్బందికి అడిషనల్ కలెక్టర్ అంకిత్ సూచించారు. బోధన్ మున్సిపాలిటీలో శుక్రవారం సబ్ కలెక్టర్ వికాస్ మహత్తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై చర్చించారు. పన్ను వసూళ్లపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.