KRNL: ఆదోని మెడికల్ కళాశాల వద్ద పిపిపి విధానాన్ని రద్దు చేయాలని సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఆదోని, ఎమ్మిగనూరు రహదారిని దిగ్బంధించగా పోలీసులు అడ్డుకుని ఘర్షణ జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ.. జీవో నం.107, 108, 590లతో వైద్య విద్య పూర్తిగా ప్రైవేటీకరణకు గురై పేదలకు దూరమవుతుందన్నారు.