NLR: ఉలవపాడు మండలం వీరేపల్లిలో మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బాలికల విద్యాభివృద్ధికి ఇలాంటి వసతి గృహాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.